ఇంగ్లాండ్‌లో కత్తిపోట్ల కలకలం..

న్యూఢిల్లీ : ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. ఆదివారం అర్ధరాత్రి తర్వాత కొందరు దుండగులు ప్రజలపై కత్తులతో దాడి చేశారని, ఇది చిన్న ఘటనేమీ కాదని వెస్ట్ మిడ్‌లాండ్స్ పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి 12.30 సమయంలో కొందరు పౌరులు తమకు ఫోన్ చేసి కత్తిదాడి గురించి వివరించారని, ఘటనా స్థలికి చేరుకోగానే కొద్ది సమయంలో మరిన్ని కత్తిదాడుల సమాచారం అందిందన్నారు.

ప్రజల రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని, ఎమర్జెన్సీ సర్వీసులనూ సమన్వయం చేసి క్షతగాత్రులకు చికిత్సకు సహకరిస్తున్నామని పోలీసులు వివరించారు. అయితే, ఎంతమంది కత్తిపోట్లకు గురయ్యారో ఇప్పుడే తేల్చలేమని పేర్కొన్నారు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇంకా సమయం పడుతుందని, ప్రజలు ఈ ఏరియా నుంచి దూరంగా ఉండాలని అభ్యర్థించారు.

Advertisement