క్రూడాయిల్ దెబ్బకు ముఖేశ్ సంపద తగ్గిపోయింది!

by Harish |
క్రూడాయిల్ దెబ్బకు ముఖేశ్ సంపద తగ్గిపోయింది!
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పుడు చర్చ మొత్తం ముడి చమురు గురించే. చరిత్రలో లేనంతగా మైనస్ ధరల్లోకి వెల్లడంతో ఆ ప్రభావం దేశీయంగా కూడా కనబడుతోంది. మన దేశంలో అత్యధికంగా ఆయిల్ నిల్వలున్న సంస్థ, అత్యంత విలువైన కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌పై కూడా ప్రతికూల ప్రభావం స్పష్టంగా కనబడింది. ముఖేశ్ అంబానీ సంస్థకు ఉదయం మార్కెట్లు ప్రారంభవగానే నిమిషాల వ్యవధిలో రూ. 30,000 కోట్లు పోగొట్టుకున్నారు. గడిచిన నెల రోజులుగా దేశంలో లాక్‌డౌన్ వల్ల ముఖేశ్ అంబానీ సంపద విలువ తగ్గిపోతూనే ఉంది. సోమవారం క్రూడాయిల్ పతనంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధరపై ఆ ప్రభావం పడింది.

ముఖేశ్ అంబానీ సంపద విలువ ఈ ఏడాది ప్రారంభం నుంచి 41 శాతం తగ్గిపోయింది. మార్చి 19 వరకూ ఆయన సంపద విలువ రూ. 34 బిలియన్ డాలర్లకు తగ్గగా, తర్వాత కొంత మేలుకుని ఏప్రిల్ 20 నాటికి 45 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ పరిణామాలతో ఇటీవల ఫోర్బ్స్ జాబితాలో టాప్ 10 నుంచి కిందకు జారారు. ప్రస్తుత 19వ స్థానంలో కొనసాగుతున్నారు. రిలయన్స్ సంస్థ ప్రధాన ఆదాయ వనరు ఆయిల్ వ్యాపారమే. క్రూడాయిల్ ధరలు భారీ పతనం సంస్థ లాభదాయకతపై కూడా ప్రభావం చూపిస్తుంది. రియల్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర తగ్గే కొద్దీ ముఖేశ్ అంబానీ సంపద విలువ కూడా తగ్గుతుది. మంగళవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర సుమారు 5 శాతాంపైగా క్షీణించి రూ. 1180 వద్ద ట్రేడవుతోంది. అధికంగా షేరు ధర రూ. 1213 గరిష్ఠ స్థాయిని తాకింది.

Tags: Mukesh Ambani, RIL, net worth,Reliance Industries

Advertisement

Next Story

Most Viewed