కొండల్లో మీసం తిప్పిన ధోని.. కూతురుతో కలిసి స్టన్నింగ్ లుక్

by Anukaran |   ( Updated:2021-06-21 21:42:03.0  )
MS Dhoni holidaying in Shimla with daughter Ziva
X

దిశ, వెబ్‌డెస్క్: మహేంద్ర సింగ్ ధోని.. క్రికెట్ అభిమానులకు ఈ పేరు వింటే గూస్ బమ్స్ వస్తాయి. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని ఐపీఎల్‌లో మాత్రమే కనిపిస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ కరోనా కారణంగా వాయిదా పడడంతో ధోని క్రికెట్‌కు తాత్కాలికంగా దూరం అయ్యాడు. ఇదే సమయంలో ఫ్యామిలీతో సిమ్లా‌ టూర్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తన కూతురు జీవాతో ధోని సోషల్ మీడియాలో ఓ ఫోటో అప్‌లోడ్ చేశాడు. సిమ్లాలోని హిల్‌స్టేషన్‌లో మీసం తిప్పిన ధోని, తోడుగా కూతరు జీవా ఫోటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. తమిళ సూపర్‌స్టార్ అజిత్.. కూతురు సెంటిమెంట్ నేపథ్యంలో నటించిన జగమల్ల (విశ్వాసం) సినిమా ఫోటోలను ట్యాగ్ చేస్తూ అభిమానులు ధోనీ-జీవాను అభివర్ణిస్తున్నారు. మరికొంత మంది తెలుగు అభిమానులు అయితే, మీసం తిప్పిన ధోని.. విక్రమార్కుడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ధోని మైదానంలో కనిపించకపోయినా.. ఇలా సోషల్ మీడియాలో కొత్త ఫోటోలతో అభిమానులకు దగ్గరవుతూనే ఉన్నాడు.

https://twitter.com/ChennaiIPL/status/1407006577702293506?s=20

Advertisement

Next Story