‘ధోనీ ఇక తప్పుకో.. యువకులకు ఛాన్స్ ఇవ్వు’

దిశ, స్పోర్ట్స్: టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రికెట్ నుంచి తప్పుకుని యువకులకు అవకాశం ఇవ్వాలని మాజీ సెలెక్టర్ రోజర్ బిన్నీ సూచించాడు. బ్యాట్స్‌మెన్‌గా తగినంత ప్రదర్శన ఇవ్వలేకపోతున్న ధోనీ తక్షణమే వైదొలగితే చాలా గౌరవంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. తాజాగా, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన బిన్నీ ధోనీపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘కొన్ని సీజన్లుగా మహీ ఆటను గమనిస్తే, అతడు ఉత్తమ ఆటగాడు అనే విషయం గతమేనని అవగతమవుతోంది. ఫిట్‌నెస్‌ కూడా ఒకింత కోల్పోయాడు. దేశ క్రికెట్‌లోకి యువ ఆటగాళ్లు దూసుకొస్తున్నారు. ఇది గమనించి ధోనీ సరైన నిర్ణయం తీసుకుంటే మంచిది’ అని అన్నారు. గతంలో ధోనీ అంటే తనకు చాలా ఇష్టం ఉండేదని, కానీ ప్రస్తుతం వయసురీత్యా అతను ఫిట్‌నెస్ కోల్పోయినట్లు అనిపిస్తున్నదన్నారు. అందుకే ఈ సలహా ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. కాగా, ధోనీ కెప్టెన్‌గా ఉన్న సమయంలోనే బిన్నీ సెలెక్టర్‌గా ఉన్నారు.

Advertisement