2006లోనే ధోని రిటైర్మెంట్ ప్రకటించాడు: లక్ష్మణ్

by Shiva |
2006లోనే ధోని రిటైర్మెంట్ ప్రకటించాడు: లక్ష్మణ్
X

దిశ, స్పోర్ట్స్: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ (Former captain of Team India) ఎంఎస్ ధోని వ్యవహార శైలి బాగుండటం వల్లే సాటి క్రికెటర్లే కాకుండా ప్రజలందరు గౌరవిస్తున్నారని వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) పేర్కొన్నాడు. ఏదైనా మ్యాచ్ గెలిచినా ఓడినా భావోద్వేగానికి గురికాకుండా ఉండటమే ధోనిని అత్యుత్తమ కెప్టెన్‌ (Outstanding Captain)గా నిలబెట్టిందన్నాడు.

‘2006లో పాకిస్తాన్‌ (Pakistan)పై టెస్టులో సెంచరీ సాధించగానే డ్రెస్సింగ్ రూమ్ (Dressing room)కి వచ్చి ఎంఎస్ ధోని అనే నేను టెస్టుల్లో సెంచరీ బాదాను. నాకిక ఏమీ అవసరం లేదు. రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా’ అని సరదాగా వ్యాఖ్యానించాడని లక్ష్మణ్ అన్నాడు. స్టార్‌స్పోర్ట్స్ (Star‌sports) నిర్వహించే క్రికెట్ కనెక్టెడ్ (Cricket Connected) అనే కార్యక్రమంలో మహీ వ్యవహార శైలిపై లక్ష్మణ్ పొగడ్తల వర్షం కురిపించాడు.

‘టీమ్ఇండియాకు నాయకత్వం వహించడం అంటే ఎవరికైనా కఠినమైన సవాలే. ఎందుకంటే ఆటగాళ్ల కంటే కెప్టెన్ (Captain) పైనే అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ధోని మాత్రం భావోద్వేగాలకు దూరంగా ఉంటాడు. అందుకే క్రీడాభిమానులే (Sports fans) కాకుండా కోట్లాది మంది భారతీయులు అతడిని గౌరవిస్తారు.

ఆయన అందరితోనూ మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తాడు. క్రికెట్‌లో రాణిస్తే ప్రేమ పుడుతుంది. కానీ, వ్యవహార శైలి బాగుండి, మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తే గౌరవం కూడా పుడుతుంది. అందుకే ధోని క్రికెట్‌కు వీడ్కోలు (Farewell to cricket) పలకగానే సామాజిక మాధ్యమాల్లో ఉవ్వెత్తున స్పందన లభించింది. సామాన్యుడి నుంచి రాజకీయ నాయకులు, సినీతారలు, వ్యాపారవేత్తలు స్పందించిన తీరును బట్టే ధోని ఎంతటి వాడో అర్థం చేసుకోవచ్చు’ అని లక్ష్మణ్ ప్రశంసలు కురిపించాడు.

Advertisement

Next Story

Most Viewed