‘సీఎస్కే, ధోనిల పెళ్లి స్వర్గంలో జరిగింది’

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును, ఎంఎస్ ధోనిని విడివిడిగా చూడలేం. గత 13 సీజన్లుగా ఫ్రాంచైజీని అన్నీ తానై నడిపిస్తున్న ధోని రెండు సార్లు ఛాంపియన్‌గా నిలబెట్టాడు. మధ్యలో రెండేళ్లు చెన్నై జట్టుపై నిషేధం విధించిన సమయంలో తప్ప మిగతా అన్ని సీజన్లలో ధోనినే సీఎస్కేకు వెన్నెముకలా నిలిచాడు. ఒక వేళ ధోనీ ఐపీఎల్ కూడా వదిలేస్తే సీఎస్కే పరిస్థితేంటని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, క్రికెట్ విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా కూడా ఇదే విషయంపై యూట్యూబ్‌లో స్పందించాడు. ‘సీఎస్కే, మహీల పెళ్లి స్వర్గంలోనే అయిపోయింది. వారిద్దరినీ విడివిడిగా మనం చూడలేం. రేపు ధోని ఐపీఎల్ ఆడటం మానేస్తే సీఎస్కే జట్టు సగం శక్తి కోల్పోతుంది. అతడు ఆటగాడిగా కాకపోయినా ఏదో ఒక పాత్రలో సీఎస్కేతోనే ఉంటాడు. ధోనిలా అన్నీ తానై జట్టును నడిపించే వాడు దొరకడం ఆ జట్టుకు కష్టమే’ అని అభిప్రాయపడ్డాడు.

Advertisement