టాలీవుడ్‌కు బాలీవుడ్ యంగ్ బ్యూటీ

by Jakkula Samataha |
Mrunal Thakur
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ సౌత్ ఎంట్రీ ఇస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. దుల్కర్ సల్మాన్ లెఫ్టినెంట్ రామ్‌గా కనిపించబోతున్న సినిమాలో తన ప్రియతమ భార్య ‘సీత’గా నటించబోతోంది. మృణాల్ పుట్టినరోజు సందర్భంగా తన ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్ బెస్ట్ విషెస్ అందించారు.

వైజయంతి మూవీస్ సమర్పణలో రూపొందుతున్న సినిమాను స్వప్న సినిమా బ్యానర్‌ నిర్మిస్తుండగా.. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు. కాగా ఇప్పటికే దుల్కర్ బర్త్ డే సందర్భంగా రిలీజైన తన లుక్‌కు బెస్ట్ కాంప్లిమెంట్స్ అందాయి. మరోవైపు అమెజాన్‌ప్రైమ్‌లో రిలీజైన ‘తుఫాన్’ ద్వారా హిట్ అందుకున్న మృణాల్.. యూనిక్ కంటెంట్ ఎంచుకుంటూ వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంటోంది.


Advertisement
Next Story

Most Viewed