బాహుబలి టీమ్‌కు క్లారిటీ లేదన్న బాలీవుడ్ హీరోయిన్

by Shyam |
mrunal thakur
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్ట్ ‘బాహుబలి : బిఫోర్ ది బిగినింగ్’ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2018లో ప్రకటించిన సిరీస్ ‘బాహుబలి : ది బిగినింగ్‌’కు లైవ్ యాక్షన్ ప్రీక్వెల్ కాగా.. ఆనంద్ నీలకంఠ నవల ‘ద రైజ్ ఆఫ్ శివగామి’ ఆధారంగా తెరకెక్కింది. ఇప్పటికే పూర్తైన ఈ ప్రాజెక్ట్‌లో యంగ్ శివగామిగా నటించింది మృణాల్. అయితే ఈ ఔట్‌పుట్‌తో సంతృప్తిగా లేని మేకర్స్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేసి మళ్లీ కొత్తగా షూటింగ్ ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ ఇప్పటి వరకు చిత్రీకరణ మొదలుపెట్టలేదు. దీంతో టీమ్‌కు క్లారిటీ లేదని భావించిన మృణాల్.. ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. రెండేళ్లుగా ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్న మృణాల్.. ఇతర ప్రొఫెషనల్ కమిట్మెంట్స్‌తో ఇక టీమ్‌లో కొనసాగలేనని చెప్పినట్లుగా సమాచారం. కాగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ దేవ కట్టా, ప్రవీణ్ సత్తారు ‘బాహుబలి : బిఫోర్ ది బిగినింగ్’కు దర్శకులుగా పనిచేశారు.

Advertisement

Next Story

Most Viewed