జెర్సీ మూవీకి మృణాల్ ఫిదా..

by  |
జెర్సీ మూవీకి మృణాల్ ఫిదా..
X

దిశ, వెబ్‌డెస్క్: టెలివిజన్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ‘సూపర్ 30’ సినిమాతో బాలీవుడ్‌కు సూపర్ ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ ఎంట్రీలోనే హృతిక్ రోషన్‌తో చాన్స్ కొట్టేయడం, యాక్టింగ్‌లో అదుర్స్ అనిపించడంతో షార్ట్ పీరియడ్‌లోనే బెస్ట్ చాన్స్‌లు అందుకుంది. ‘బట్లా హౌజ్, ఘోస్ట్ స్టోరీస్’తో నటిగా మంచి మార్కులు వేయించుకున్న మృణాల్.. అమీర్ ఖాన్ ‘దంగల్’ సినిమాతోనే తన బాలీవుడ్ ఎంట్రీ ఉండాల్సింది కానీ, టీవీ సీరియల్స్ అండ్ ప్రోగ్రామ్ కమిట్‌మెంట్స్‌తో కుదరలేదని చెప్పింది. దేశవ్యాప్తంగా చాలా మంది అమ్మాయిలను ఈ సినిమా కోసం చేసిన కాస్టింగ్‌ చేశారని, కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చోబ్రా తనను సెలెక్ట్ చేశాడని, ఆ కాస్టింగ్‌లో తను టాప్ 20లో ఉన్నట్లు చెప్పింది. అయితే, క్యారెక్టర్ కోసం చాలా వర్క్ షాప్స్ కండక్ట్ చేశారని.. వేరే టీవీ ప్రోగ్రామ్ వల్ల హాజరుకాలేక పోవటంతో ఆ చాన్స్ మిస్ అయిందని తెలిపింది.

ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని ‘జెర్సీ’ రీమేక్‌లో కనిపించబోతున్న మృణాల్.. షాహిద్ కపూర్‌కు జోడీగా నటించబోతుంది. షాహిద్‌తో నటించేందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉందంటున్నారు భామ.. తెలుగులో ‘జెర్సీ’ సినిమా చూశాక ఆ ఎమోషనల్ జర్నీకి ఫిదా అయినట్లు తెలిపింది. రెండు గంటల సినిమాలో జీవితకాల అనుభవం మొత్తం ఉందని.. ఆ ఎమోషన్స్ హృదయంలో అలాగే రాత్రంతా నిలిచిపోయాయని తెలిపింది. దీంతో ఉదయం మళ్లీ సినిమా చూశానని.. హిందీ ప్రేక్షకులు కూడా ఇలాంటి అనుభవం పొందుతారని ఎదురుచూస్తున్నట్లు చెప్పింది.



Next Story

Most Viewed