ఏకంగా కొండనే రాసిచ్చిన మాజీ తహశీల్దార్ 

దిశ, వెబ్ డెస్క్ : కర్నూలు జిల్లా ప్యాపిలి మాజీ తహశీల్దార్ భూమాయజాలం చేశాడు. ఒక్కొక్కరికి 3 ఎకరాలు చొప్పున 86 మందికి 258 ఎకరాలకు పాస్ పుస్తకాలు ఇచ్చి ఆన్లైన్ లో రిజిస్టర్ చేయించాడు. ప్రస్తుత తహశీల్దార్ శివరాముడు ఈ భుమాయాజాలంపై విచారణ చేపట్టగా నిజాలు బయటపడ్డాయి.

బూరుగుల కొండపై సోలార్ ప్రాజెక్టు వస్తుందనే ప్రచారంతో డబ్బులు సుకుని ఏకంగా కొండనే రాసిచ్చాడు మాజీ తహశీల్దార్. కాగా, తహశీల్దార్ ల అక్రమాలు ఒక్కొక్కటిగా బయట పడుతుండటంతో అధికారుల్లో కలవరం మొదలైంది.

Advertisement