ఈ తహసీల్దారు రసికుడే..!

by  |
ఈ తహసీల్దారు రసికుడే..!
X

దిశ, వెబ్‌డెస్క్ :

రెవెన్యూ ఉద్యోగులు ఈ మధ్యకాలంలో చాలా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ముఖ్యంగా అక్రమార్జన విషయంలో ఎక్కడోచోట అధికారులు బుక్ అవుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలోని ఓ తహసీల్దారు మాత్రం కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశారు. ఆఫీసు పరిసరాల్లో ఏకంగా ఓ మహిళతో ముద్దుముచ్చటలాడుతూ కనిపించారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఈ దృశ్యాలు తాజాగా వెలుగులోకి రావడంతో ఆ ఉన్నతాధికారి రాసలీలలు ఆ రాష్ట్రంలో వైరల్‌గా మారాయి.

వివరాల్లోకివెళితే .. కర్ణాటక రాష్ట్రంలోని కొప్పళ నగరాభివృద్ధి ప్రాధికార కార్యాలయంలో పనిచేస్తున్నతహసీల్దార్‌ గురు బసవరాజు.. రెండు నెలల కిందట కుష్టిగి తహసీల్దార్‌గా పనిచేస్తున్న సమయంలో ఆఫీసు పరిసరాల్లోనే ఓ మహిళా ఉద్యోగికి ముద్దుపెడుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. అది కాస్త ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో దీనిపై విచారణకు ఆదేశించారు. కాగా, ప్రభుత్వ కార్యాలయంలో తోటి మహిళా ఉద్యోగితో రాసలీలలకు పాల్పడిన అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.


Next Story