కేసీఆర్ కుటుంబం కోసం.. మహా మృత్యుంజయ హోమం

by Shyam |
Mrityunjaya Homam
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవలే కరోనా బారిన పడిన సీఎం కేసీఆర్, కేటీఆర్, జోగినపల్లి సంతోష్ కుమార్‌లు త్వరగా కోలుకోవాలని హైదరాబాద్‌లోని నల్లకుంట పాత రామాలయంలో ఆదివారం సంజీవని మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు అనంతాచార్యులు ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్, స్టోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి దంపతులు ఈ హోమాన్ని జరిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనా వైరస్ నుంచి సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు త్వరగా కోలుకొని తిరిగి విధులకు హాజరై రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని, కరోనా వైరస్ అంతం కావాలని ప్రత్యేక హోమం, పూజలు నిర్వహించినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed