పరిషత్ ఎన్నికలకు ‘సై’.. పెండింగ్‌లోనే రిజల్ట్స్‌!

by srinivas |
పరిషత్ ఎన్నికలకు ‘సై’.. పెండింగ్‌లోనే రిజల్ట్స్‌!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో పరిషత్ ఎన్నికలు ఎట్టకేలకు అనుకున్న సమయానికే జరగనున్నాయి. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేయడంతో ఈసీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం రేపు(గురువారం) ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 513 జెడ్పీటీసీ, 7230 ఎంపీటీసీ స్థానాలకు రేపు పోలింగ్ ఉండగా, జెడ్పీటీసీ బరిలో 2,092.. ఎంపీటీసీ బరిలో 19,002 అభ్యర్థులు బరిలో ఉన్నారు. పరిషత్ ఎన్నికల నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా 33,663 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 2కోట్ల 82లక్షల 15,104 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

అదేవిధంగా ఎన్నికల విధుల్లో 2లక్షల 1,978 మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. ఇదిలాఉండగా, ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని జనసేన, బీజేపీ, వామపక్షాలు ప్రకటించాయి. కాగా, నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారని పేర్కొంటూ ప్రతిపక్ష టీడీపీ పార్టీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల నిర్వహణకు సంబంధించి పనులను అధికారులు వేగవంతం చేశారు.ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ పూర్తి చేసి సిబ్బందిని తరలించాలని ఎస్ఈసీ ఆదేశించింది.

Advertisement

Next Story