- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్‌ఎస్‌కు షాక్.. తాండూరు కీలక నేత రాజీనామా
దిశ, తాండూరు: నాయకులతో నిండు కుండల మారిన టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తుల జ్వాల రగులుతోంది. పార్టీలో గుర్తింపు, గ్రామాభివృద్ధికి నిధులు కేటాయికపోవడంతో ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా బుధవారం వికారాబాద్ జిల్లా, పెద్దేముల్ మండలంలోని ఇందూర్ ఎంపీటీసీ పటేల్ ప్రవీణ్ కుమార్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాజీనామా లేఖను మండల పార్టీ అధ్యక్షుడు నారాయణరెడ్డికి అందించినట్లు తెలిపారు.
అయితే ఇటీవలే డిఎంఎఫ్టీ నిధుల్లో గ్రామ అభివృద్ధికి తక్కువ నిధులు కేటాయించడంతో అసంతృప్తి నెలకొన్నదని సమాచారం. బడా స్థాయి ప్రజాప్రతినిధుల నుంచి మొదలుకుంటే మండల స్థాయిలో పార్టీలో తమకు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన ప్రవీణ్ పటేల్ గ్రామ అభివృద్ధి కోసమే గత కొంతకాలం క్రితం ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీకి, సభ్యత్వానికి ప్రవీణ్ పటేల్ రాజీనామా చేయడంతో మండలంలో చర్చనీయాంశంగా మారింది.