- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ కుటుంభ సభ్యుల ఫిర్యాదు
దిశ, వెబ్‌డెస్క్ : నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రాణానికి హాని ఉన్నదని, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కుటుంబ సభ్యులు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. గురువారం రఘురామ కృష్ణంరాజు భార్య రమాదేవి, కుమారుడు భరత్, కుమార్తె ఇందిరా ప్రియదర్శిని ఢిల్లీలో స్పీకర్ ను కలిశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు, ఏపీ సీఐడీ దర్యాప్తు తీరు, కోర్టు ధిక్కారాన్ని స్పీకర్ కు వివరించారు.
లోక్ సభ స్పీకర్ అనుమతి లేకుండనే ఎంపీని అరెస్ట్ చేశారని, రఘురామ కృష్ణంరాజును అదుపులోకి తీసుకున్న సీఐడి చిత్రహింసలకు గురి చేసిందని ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలపై చర్యలు తీసుకోవాలని ఆయనను కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన లోక్ సభ స్పీకర్.. ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసి నివేదిక తెప్పిస్తానని, నిబంధనలు అతిక్రమించినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.