- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆఫీసుకు వేళాయే.. అధికారులేమో ఇంకా రారాయే.. ఎంపీడీవో పనితీరు
దిశ, అచ్చంపేట : గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు ఉదయం 7 గంటలకే కార్యాలయానికి చేరుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కచ్చితమైన ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. నాగర్ కర్నూలు జిల్లాలోని ఉప్పునుంతల మండలంలోని ఎంపీడీవోతో పాటు పంచాయతీ కార్యదర్శులు ఆడింది ఆట, పాడింది పాటగా మారిందని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో (ఎంపీడీఓ) సమయం 12 కావస్తున్నా ఇప్పటివరకు ఏ ఒక్క శాఖకు సంబంధించిన అధికారులు హాజరు కాలేదు. ప్రజలు ప్రశ్నించే తత్వాన్ని మర్చిపోయారా..? లేక అధికారుల అలసత్వానికి నిదర్శనమా..? వేలకు వేలు జీతాలు పొందుతూ సమయపాలన పాటించకుంటే ప్రశ్నించే వారికి గ్రామాల్లో విసిటింగ్‌లో ఉన్నామని సాకులు చెబుతూ వారు సొంత పనులపై తిరుగుతూ అక్కడ అక్కడ కంట పడ్డ సంఘటన చాలానే ఉన్నాయి.
సామాన్యులకు సైతం అందని ఫలంగా ఎంపీడీవో కార్యాలయం మారిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. కార్యాలయానికి తాళం వేసి, ఉద్యోగస్తులందరూ ఉద్యోగ బహిష్కరణ చేసే వరకు ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించి వారి ఆగడాలను ఎండగడతామని ప్రజలు హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లో ఉండాల్సిన పంచాయతీ కార్యదర్శులు ఇళ్ళలో ఉంటూ కాలయాపన చేస్తున్నారని, చాలావరకు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఒక అటెండెంట్ సిస్టమ్‌ని ఏర్పాటు చేసి యాప్‌ను సృష్టించింది. అయినా వారు తెలివితేటలతో గ్రామాల్లో పని చేసే గ్రామ పంచాయతీ సిబ్బంది మొబైల్లో యాప్‌ను ఇన్స్టాల్ చేసి వారు ఉదయం ఏడు గంటలకు ఆఫీసులో ఉన్నట్లు ఫోటోలను సృష్టిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే ఆఫీస్ వద్ద ఉన్నామంటూ సాకులు చెప్పడం ఆఫీసు వద్ద నుంచి కాల్ చేస్తే గ్రామాల్లో ఉన్నామనడం పరిపాటిగా మారింది. ఇక ఎంపీడీవో విషయానికి వస్తే ఆయన వారానికి కేవలం మూడు రోజులు మాత్రమే కార్యాలయానికి హాజరవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవాలని సామాన్య ప్రజలకు న్యాయం చేకూరేలా అధికారుల తీరు మారాలని మండల ప్రజలు కోరుతున్నారు.