విషాదం.. కరోనాతో ఎంపీడీవో మృతి

by Sumithra |
విషాదం.. కరోనాతో ఎంపీడీవో మృతి
X

దిశ, గుండాల : కరోనా వైరస్ మరో అధికారిని బలి తీసుకుంది. ఖమ్మం జిల్లాలోని గుండాల.. మండల పరిషత్ అభివృద్ధి అధికారి(ఎంపీడీవో) వెంకట్ రావు కరోనాతో పోరాడుతూ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో మృతిచెందారు. కొద్ది రోజుల క్రితం ఆయన కరోనా బారినపడటంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆయన నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. 2019లో గుండాల ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన వెంకట్ రావు రెండు సంవత్సరాలు అంకితభావంతో ఏజెన్సీ ప్రాంతంలో పని చేశారు. ఎంపీడీవో మృతి పట్ల కార్యాలయ సిబ్బందితో పాటు పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story