- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వచ్చే ఐదేళ్ల వరకు ఇప్పుడున్న ద్రవ్యోల్బణ లక్ష్యమే!
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: ద్రవ్యోల్బణ లక్ష్యంపై యథాతథ స్థితిని కొనసాగిస్తూ ప్రభుత్వం బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)ని ఆదేశించింది. వచ్చే ఐదేళ్ల కాలానికి 2-6 శాతం ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐ అంగీకరించాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్ చెప్పారు. ప్రస్తుతం రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 (+/-2 శాతం) శాతం లోపునకు పరిమితం చేసేలా ఆర్‌బీఐ లక్ష్యంగా ఉన్న సంగతి తెలిసిందే.
అయితే ఇందులో 6 శాతం ఎగువ స్థాయికి మించి ద్రవ్యోల్బణం గతేడాది పలుసార్లు నమోదైంది. ‘ఆర్‌బీఐ యాక్ట్-1934 ప్రకారం 2021, ఏప్రిల్ 1 నుంచి 2026, మార్చి 31 వరకు ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని మునుపటి ఐదేళ్ల మాదిరిగానే కొనసాగినుందని’ తరుణ్ బజాజ్ వెల్లడించారు.
Advertisement
Next Story