నూతన శకానికి నాంది : ఎంపీ విజయసాయిరెడ్డి

by srinivas |
నూతన శకానికి నాంది : ఎంపీ విజయసాయిరెడ్డి
X

దిశ, ఏపీ బ్యూరో: కడప ఉక్కు కార్మాగారంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో 30 వేల మందికి ఉపాధిని అందించేలా ఉక్కు కర్మాగారం మొదలవడం రాష్ట్రంలో నూతన శకానికి నాంది పలికినట్లయిందని ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఇదే వెలుగు దివ్వెలా అభివృద్ధికి దారి చూపుతుందన్నారు. కొరియన్ ఉక్కు దిగ్గజం పోస్కో ప్రభుత్వ చొరవను ప్రశంసించడం అందుకు సంకేతమన్నారు. సీఎం జగన్ సంకల్పానికి ఇదే నిదర్శనమని ఎంపీ విజయసాయి వ్యాఖ్యానించారు.



Next Story

Most Viewed