ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితులకు శుభవార్త..

by srinivas |
ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితులకు శుభవార్త..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఉద్దానం పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది కిడ్నీ వ్యాధి బాధితులు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ లెక్కల ప్రకారం ఈ ప్రాంతంలో సుమారు 37శాతం ప్రజలు కిడ్నీవ్యాధి సమస్యలతో సతమతం అవుతున్నారని అంచనా. అందుకు కారణం అక్కడ పరిశుభ్రమైన తాగునీరు లేకపోవడమే. కలుషిత నీరు తాగడం వలన చిన్న పిల్లల నుంచి పెద్దవారు సైతం కిడ్నీ సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు.

తాజాగా ఏపీ ప్రభుత్వం ఉద్దానం ప్రాంత వాసులకు శుభవార్త చెప్పింది.ఈ విషయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.‘ఉద్దానం కిడ్నీ సమస్యలకు శాశ్వతంగా చెక్ పెడుతోంది జగన్ గారి ప్రభుత్వం. రూ.700 కోట్లతో ఉద్దానంలోని ఏడు మండలాలకు నీరందించే పథకం ప్రారంభిస్తున్నారు. హిరమండలం రిజర్వాయర్ నుంచి ఉద్దానంకు మంచినీరు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇది 8 లక్షలమంది వెనుకబడ్డ ప్రాంత ప్రజలకు సంజీవనిలా మారనుందని.. దాంతో ఇకమీదట కలుషిత భూగర్భ జలాల సమస్యే ఉండదు – వాటివల్ల వచ్చే జబ్బులూ ఉండవు’. అని ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed