2021 వరకు పోలవరాన్ని పూర్తి చేస్తాం…

దిశ వెబ్ డెస్క్:
పోలవరం ప్రాజెక్ట్‌ను వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ…పోలవరం ప్రాజెక్ట్ జాతీయ హోదా కలిగిన ప్రాజెక్ట్ అని అన్నారు. అందుకే ప్రాజెక్ట్ ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించాల్సి ఉందన్నారు. కాగా కేంద్ర సాయం కోసం ఎదురు చూడకుండా ప్రాజెక్ట్ పై తమ ప్రభుత్వమే రూ. 3805 కోట్లను ఖర్చు చేసిందని ఆయన వివరించారు. దీన్ని ధ్రువీకరిస్తూ కాగ్ నివేదిక ఇవ్వగా దాన్ని కేంద్రానికి సమర్పించామని తెలిపారు. కాగా ప్రాజెక్ట్ పై పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని ఆయన కోరారు. దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఈ విషయంపై రాష్ట్ర ఆర్థికమంత్రి, కేంద్ర జలమంత్రితో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

Advertisement