మిర్యాలగూడ ప్రజలకు ఎంపీ ఉత్తమ్ గుడ్‌న్యూస్

by Shyam |
మిర్యాలగూడ ప్రజలకు ఎంపీ ఉత్తమ్ గుడ్‌న్యూస్
X

దిశ, మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణ ప్రజలకు నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. పట్టణ పరిధిలో రోడ్ల వెడల్పు పనులకు కేంద్ర ప్రభుత్వం రూ. 25 కోట్ల నిధులు విడుదల చేసినట్లు ఉత్తమ్ పేర్కొన్నారు. ఈ మేరకు జాతీయ రహదారుల ముఖ్య కార్యదర్శి గిరిధర్ ఓ ప్రకటన విడుదల చేశారు. NH-167 అప్ గ్రేడేషన్ పనుల్లో భాగంగా పట్టణంలోని సాగర్ రోడ్డును నాలుగు లైన్ల రహదారిగా విస్తరించనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం అదనపు నిధులు విడుదల చేయాలని గతంలో ఉత్తమ్ చేసిన ప్రతిపాదన మేరకు, కేంద్ర ప్రభుత్వం అదనంగా రూ. 25 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి తన చొరవను ప్రజలు గుర్తించాలని ఎంపీ ఉత్తమ్ కోరారు.

Advertisement
Next Story

Most Viewed