- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ కుట్రను బయటపెట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
దిశ, కోదాడ: హుజురాబాద్ ఉప ఎన్నికల కోసమే కేసీఆర్ ‘దళిత బంధు’ పెట్టి దళితులను మోసం చేయడానికి ఎత్తుగడ వేస్తున్నారని మాజీ పీసీసీ అధ్యక్షులు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ… గతంలో దళితులకు ఇచ్చిన హామీలు.. మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళిత ముఖ్యమంత్రి హామీలు ఏమయ్యాయాని ప్రశ్నించారు. రాష్ట్రంలో 16 శాతం ఎస్సీ జనాభా ఉన్నా క్యాబినెట్లో ఒక స్థానం మాత్రమే ఉందని జనాభాలో 60 శాతం కూడా లేని ముఖ్యమంత్రి సామాజికవర్గానికి 30 శాతం మంత్రివర్గంలో స్థానం ఉందన్నారు. కేంద్రంలో మోడీ రాష్ట్రంలో కేసీఆర్ గూఢచార వ్యవస్థ నడిపిస్తున్నారు. దళితులపై చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్లో లక్షన్నర కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కృష్ణా గోదావరి నదీ జలాల పంపిణీలో ముఖ్యమంత్రి చేతగానితనం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని కాలేశ్వరం డిండి నక్కలగండి పాలమూరు-రంగారెడ్డి నెట్టెంపాడు ప్రాజెక్టులకు కేంద్రం నోటిఫికేషన్‌లో లేవని ప్రకటించిందని ఇదంతా ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ఎద్దేవా చేశారు.
ప్రాజెక్టుల కోసం పార్లమెంట్లో పోరాడుతామని అన్నారు పెగాసస్ సాఫ్ట్ వేర్‌తో కేంద్రంలో మోడీ రాష్ట్రంలో కేసీఆర్ నాయకులు ప్రతిపక్ష నాయకులు ప్రజాస్వామ్యవాదులు జర్నలిస్టులపై నిఘా వేసి ఫోన్ టాపింగ్ చేస్తున్నారని విమర్శించారు. గూడచారి వ్యవస్థ నడిపించడం రాజ్యాంగం చట్ట వ్యతిరేకమని పార్లమెంటులో ఈ అంశంపై ప్రశ్నిస్తున్నారు సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కోదాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంగవీటి రామారావు, డీసీసీ ఉపాధ్యక్షులు పార సీతయ్య, ఒంటి పులి వెంకటేష్, తూమాటి వరప్రసాద్ రెడ్డి, జైపాల్ రెడ్డి, ముస్కు శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కందుల కోటేశ్వరరావు, షాబుద్దీన్, గంధం యాదగిరి, నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.