ఎంపీ ఉత్తమ్ మోకాలికి తీవ్రగాయం

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మోకాలికి తీవ్ర గాయమైంది. మోకాలికి పెద్ద బ్యాండేజ్‌తో వాకింగ్ క్రచెస్ సాయంతో నడుస్తున్న ఫొటోను కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ విడుదల చేసింది.

తమ ప్రియతమ పీసీసీ చీఫ్ త్వరగా కోలుకోవాలంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం ఆకాంక్షిస్తూ పోస్టు చేసింది. అయితే, ఉత్తమ్ కుమార్‌కు గాయం ఎలా అయిందన్న విషయం ఇంకా తెలియరాలేదు.

Advertisement