- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోర్టులు మొట్టికాయలు వేసినా.. మారని తీరు
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ ఎంపీ సుజనా మరోసారి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం 65 సందర్భాల్లో కోర్టులతో మొట్టికాయలు వేయించుకుందని, అయినా ఏమార్పు రాలేదన్నారు. రాష్ట్రంలో ఇంత వరకూ ఒక్క ప్రాజెక్టు కూడా ముందుకు సాగలేదని సుజనా చౌదరి విమర్శించారు. ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకత్వంలో బీజేపీ బలపడుతుందనే నమ్మకం ఉందన్నారు.
రాజధాని బిల్లును గవర్నర్‌కు పంపడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రభుత్వం సెక్షన్ 5, 6కి వ్యతిరేకంగా ముందుకు పోతున్నట్లు పేర్కొన్నారు. ఆర్టికల్ 196 ప్రకారం కౌన్సిల్ ఆమోదం లేకుండా బిల్లును ఆమోదించకూడదన్నారు. అమరావతి అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లే అన్నారు. ఏపీలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి అని కేంద్ర నిర్ణయంతో అది తేలిపోయిందన్నారు. రాజు మారినప్పుడల్లా రాజధాని మారదని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి విమర్శించారు.