- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇష్టారీతిన పాలిస్తామంటే కుదరదు: సుజనా చౌదరి
by srinivas |

X
దిశ ఏపీ బ్యూరో: ఇష్టారీతిన పాలిస్తామంటే కుదరదని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి హెచ్చరించారు. ట్విట్టర్ మాధ్యమంగా స్పందించిన ఆయన కోర్టులో ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ వైఎస్సార్సీపీ తీరు మార్చుకోవడం లేదని విమర్శించారు. ప్రజలు 151 సీట్లతో గెలిపించారు కాబట్టి రాజ్యాంగ వ్యవస్థలను, చట్టాలను లెక్కచేయకుండా పాలన చేస్తానంటే కుదరదని ఆయన స్పష్టం చేశారు.
వైఎస్సార్సీపీ ఇప్పటికైనా పనితీరును సమీక్షించుకుని, ప్రజలకు సరైన పాలన అందించాలని కోరుతున్నానని అన్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలకు కోర్టుల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నా చీమకుట్టినట్టయినా లేదని ఆయన ఆక్షేపించారు. చివరకు సుప్రీం కోర్టు తీర్పులను సైతం లెక్కచేయకుండా తామనుకున్నట్టుగా పరిపాలించాలనుకోవడం మూర్ఖత్వం అవుతుందని ఆయన సూచించారు.
Next Story