- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
3 లక్షల మంది స్టూడెంట్స్‌కు వాట్సాప్‌లో స్టడీ మెటీరియల్
దిశ, వెబ్ డెస్క్: కరోనా కాలంలో.. డిజిటల్ లిటరసీ చాలా పెరిగింది. ఆన్ లైన్ తరగతులు, ఆన్ లైన్ కోర్సుల వైపు విద్యార్థులు దృష్టి సారిస్తున్నారు. ఈ కాలం పిల్లలందరూ కూడా డిజిటల్ విషయంలో వెరీ‘స్మార్ట్’ కావడంతో.. స్కూలు, కాలేజీ యాజమాన్యాలు ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ బోర్డు తమ విద్యార్థులకు ఎడ్యుకేషనల్ కంటెంట్ ను ‘వాట్సాప్’లో పంపిస్తుంది.
లాక్ డౌన్ కారణంగా.. స్కూళ్లు, కాలేజీలు అన్నీ మూతపడ్డాయి. ఇవి తెరుచుకోవడానికి మరో రెండు నెలలు పట్టేలా ఉంది. దాంతో మధ్యప్రదేశ్ బోర్డు విద్యార్థుల కెరీర్ ను దృష్టి లో పెట్టుకుని ‘ఎడ్యుకేషనల్ కంటెంట్’, స్టడీ మెటరీయల్ ను వారికి వాట్సాప్ లో సెండ్ చేస్తోంది. ఇప్పటికే 3 లక్షల మంది విద్యార్థులకు పంపినట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు. 727 ప్రభుత్వ పాఠశాలలు, 645 హైయ్యర్ సెకండరీ స్కూళ్లకు చెందిన విద్యార్థులు దీని వల్ల లబ్ధి పొందుతున్నారు. మొత్తంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన 1265 గ్రూపుల్లో 1.4 లక్షల మంది విద్యార్థులున్నారు. స్టేట్ బోర్డు తో అనుసంధానమున్న ప్రైవేటు స్కూళ్లు కూడా ఆన్ లైట్ బాట పట్టాయి. ఇవి ఆన్ లైన్ ఎడ్యుకేషన్ ద్వారా 1.2 లక్షల మంది విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాయి. ప్రైవేటు స్కూళ్లకు చెందిన 5888 వాట్సాప్ గ్రూపుల్లోనూ ఎడ్యుకేషనల్ కంటెంట్, స్టడీ మెటరీయల్ ను అందిస్తున్నారు.