- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దీక్ష చేద్దాం వస్తవా?.. కేటీఆర్‌కు రేవంత్ సవాల్
దిశ, తెలంగాణ బ్యూరో: ఐటీఐఆర్, విభజన చట్టంలోని హామీలను సాధించుకునేందుకు ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపడుదామని, అందుకు టీఆర్‌ఎస్ సిద్ధమేనా అంటూ మంత్రి కేటీఆర్‌కు ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొద్ది రోజులుగా టీఆర్ఎస్ చేస్తున్న ప్రకటనలు వింటుంటే నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో మంజూరు చేసిన ఐటీఐఆర్‌లాంటి పథకాలను మోడీ సర్కార్ అటకెక్కించిందని, అప్పుడు నోరు మెదపని టీఆర్ఎస్ ఓట్ల కోసం మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ మోడీ మెడలు వంచుతామని చెప్పి, ఢిల్లీకి వెళ్లి తానే మెడలు వంచి జీ హుజూర్ అన్న దృశ్యాలను తెలంగాణ ప్రజలు ఇంకా మరువలేదని లేఖలో పేర్కొన్నారు. ప్రజలను మోసం చేయడంలో కేటీఆర్ కేసీఆర్‌ను మించిపోయారని విమర్శించారు.
తెలంగాణను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భ్రష్టు పట్టిస్తున్నాయని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌తో ఎన్నికల సమయంలో కుస్తీ చేసి, తరువాత దోస్తీ చేయడం టీఆర్‌ఎస్‌కు పరిపాటిగా మారిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ఏం చెబితే అది టీఆర్ఎస్‌కు వేదమన్నారు. రెండు పార్టీల ఆత్మ ఒక్కటే కానీ శరీరాలు వేరన్నారు. విభజన చట్టంలోని హామీల్లో ఎన్ని అమలయ్యాయో ప్రభుత్వాలు చూపించాలని ప్రశ్నించారు. ములుగులో గిరిజన వర్సిటీ, బయ్యారంలో స్టీల్ ప్లాంట్, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఎంత వరకు వచ్చిందని నిలదీశారు. కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీ, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏమైందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పార్లమెంట్ మలి విడత సమావేశాల్లో ఈ అంశాలపై చర్చించి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.