జీత భత్యాలకు ‘రంజన్ గొగోయ్’ దూరం..

దిశ, వెబ్‌డెస్క్ :

సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌ గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. సీజేఐ పదవి విరమణ తర్వాత ఆయన రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, గొగోయ్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి జీత భత్యాలతో పాటు అలవెన్సులను కూడా తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఈ విషయంపై ‘ఇండియా టుడే’ ఆర్టీఐ చట్టం సమాచారం సేకరించింది. రాజ్యసభ సభ్యుని హోదాలో వచ్చే జీత భత్యాలను గొగోయ్ వద్దనుకుంటున్నట్లు రాజ్యసభ సచివాలయానికి ఓ లేఖ రాసినట్లు సమాచారం.

‘ తాను రాజ్యసభ సభ్యుని హోదాలో పొందే జీతభత్యాల్లో ( ప్రయాణ ఖర్చులు మినహా) మిగతావి తీసుకోవడం లేదు. వీటికి బదులు సీజేఐగా పదవీ విరమణ పొందిన అనంతరం వచ్చే ప్రయోజనాలను మాత్రం పొందాలని నిర్ణయించుకున్నానని’ అని రంజన్ గొగోయ్ ఆ లేఖలో పేర్కొన్నారు. సీజేఐగా పదవీ విరమణ పొందాక తనకు రూ. 82,301పెన్షన్ వస్తోందని గొగోయ్ వెల్లడించారు.

Advertisement