జాబ్ క్యాలెండర్ కాదు.. డాబు క్యాలెండర్

by srinivas |   ( Updated:2021-06-27 03:06:32.0  )
MP Rammohan Naidu
X

దిశ, ఏపీ బ్యూరో: జగన్ సర్కార్‌పై టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో యువతను మోసించేశారని ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పిన సీఎం జగన్ తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలను మోసం చేశారంటూ మండిపడ్డారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడంలేదో చెప్పాలని నిలదీశారు.

జాబ్ క్యాలెండర్ కేవలం డాబు క్యాలెండర్ అంటూ కొట్టిపారేశారు. కొత్త ఉద్యోగాలు ఎలా ఉన్నా.. ఉన్న ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి నెలకొందని విమర్శించారు. ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయని ప్రజలను నమ్మించిన జగన్‌ నయవంచకుడు అంటూ ఎంపీ రామ్మోహన్‌నాయుడు విమర్శించారు.


Advertisement
Next Story

Most Viewed