- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బిగ్ బ్రేకింగ్ : ఎంపీ రఘురామకృష్ణం రాజు అరెస్టు
దిశ, వెబ్‌డెస్క్ : వైసీపీ నాయకులు, నర్సాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణం రాజును పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని అతని నివాసానికి సీఐడీ పోలీసులు వెళ్లారు. తనను ఏ కేసులో అరెస్టు చేయడానికి వచ్చారో చెప్పాలని ఎంపీ సీఐడీ పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్నట్లు తెలుస్తోంది.తమతో సీఐడీ కార్యాలయానికి వస్తే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పినట్లు సమాచారం. అతనిపై ప్రభుత్వ ప్రతిష్టకు భంగం వాటిల్లెలా వ్యాఖ్యానించినందుకు గాను 124 ఏపీసీ-ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
అనంతరం ఆర్ఆర్ఆర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు. దీనిపై రఘురామకృష్ణం రాజు మాట్లాడుతూ.. తనకు వారెంట్ ఇవ్వకుండా నన్ను అరెస్టు చేయడంతపై నర్సాపురం ఎంపీ మండిపడ్డారు.ఇదిలాఉండగా, ఈయన గత కొద్దిరోజుల నుంచి అధికార పార్టీ వైసీపీకి, ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా స్టేట్ మెంట్స్ ఇస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే అతని అరెస్టు జరిగినట్లు పొలిటికల్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.