- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నేను రెడీ…మీరు రెడీనా…
by srinivas |

X
దిశ వెబ్ డెస్క్:
రాజీనామా చేయాలని తనను సవాల్ చేస్తున్న వైసీపీ నాయకులకు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన రాజీనామాతో పార్టీకి ఏం సంబంధమని, అదేమైనా రెఫెరెండమా అని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాగా ఈ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తాను రాజీనామా చేసి ఎన్నికలకు వెళతానని ఆయన అన్నారు. అయితే ఆ ఎన్నికను అమరావతిపై రెఫరెండంగా భావిస్తామని చెప్పాలని వైసీపీ నాయకులను ఆయన డిమాండ్ చేశారు. ఆ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచి చూపిస్తానని రఘురామ కృష్ణం రాజు ధీమా వ్యక్తం చేశారు.
కాగా వైసీపీకి ఆయన తాజాగా సవాల్ విసిరారు. తాను రాజీనామా చేసి ఉపఎన్నికల్లో నెగ్గితే రాజధానిగా అమరావతిని కొనసాగిస్తాననీ హమీ ఇచ్చేందుకు సీఎం జగన్ సిద్దమేనా అంటూ సవాల్ విసిరారు.
Next Story