- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్‌కు ప్రశంస.. చిరంజీవికి సెటైర్ !
దిశ, ఏపీ బ్యూరో: చిరంజీవి కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న సీఎం జగన్ కరోనా అవగాహన చిత్రం చేయాలని వైఎస్సార్సీపీ రెబెల్, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు మాస్కు పెట్టుకోవాలంటూ సినీ నటులు చిరంజీవి తదితరులు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారన్న రఘురామ కృష్ణంరాజు, ఆయన కంటే ఎక్కువ మంది అభిమానులు ఉన్న జగన్ ఓ మంచి కార్యక్రమం చేపడితే బాగుండు అని అభిప్రాయపడ్డారు. ఓ చక్కని చిత్రం చేసి.. ప్రజలకు స్ఫూర్తిగా నిలవాలని సూచించారు.
తద్వారా కరోనా నియంత్రణ చర్యల్లో జగన్ ముందుండాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్న ఆయన, సుమారు 20 కార్యక్రమాలు జగనన్న పేరుతో ఉన్నాయని గుర్తు చేశారు. జగనన్న పేరుతో ఈ వైరస్‌పై పోరాటం చేయాలని కోరారు. యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. జగనన్న పేరు ఉంటేనే ప్రజల్లో, అధికారుల్లో సీరియస్ నెస్ ఉంటుందని పేర్కొన్నారు. దీనికి జగనన్న కరోనా కేర్ అని కానీ, జగనన్న కరోనా వార్ అనో పేరు పెడితే బాగుంటుందని సూచించారు.