సైబరాబాద్ సీపీ సజ్జనార్‌పై ఫిర్యాదు.. కేసీఆర్‌కు లేఖ రాసిన RRR

by srinivas |   ( Updated:2021-05-30 04:34:13.0  )
సైబరాబాద్ సీపీ సజ్జనార్‌పై ఫిర్యాదు.. కేసీఆర్‌కు లేఖ రాసిన RRR
X

దిశ, వెబ్‌డెస్క్: సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. తనను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన వ్యవహారంలో సైబరాబాద్ కమిషనర్, గచ్చిబౌలి స్టేషన్ హౌస్ ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా రఘురామకృష్ణంరాజు కోరారు.

గచ్చిబౌలి పోలీసుల అనుమతి తీసుకోకుండానే తనను అరెస్ట్ చేశారని, ఏపీ సీఐడీ అధికారులకు గచ్చిబౌలి పోలీసులు సహకరించారని ఆరోపించారు. తనను అరెస్ట్ చేసే సమయంలో నిబంధనల ప్రకారం గచ్చిబౌలి పోలీసుల నుంచి ఏపీ సీఐడీ అధికారులు అనుమతి తీసుకోవాల్సి ఉందని, కానీ అనుమతి తీసుకోకుండా అరెస్ట్ చేశారని లేఖలో పేర్కొన్నారు.

ఈ విషయంపై విచారణ జరపాలని కేసీఆర్‌ను రఘురామకృష్ణంరాజు కోరారు. తన ఇంటికి వచ్చిన ఏపీ సీఐడీ అధికారులతో గచ్చిబౌలి పోలీసులు కూడా కలిసిపోయారని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed