AP News : పవన్ 3 పెళ్లిళ్లు చేసుకుంటే తప్పేముంది? : RRR

by srinivas |   ( Updated:2021-09-28 07:11:43.0  )
AP News : పవన్ 3 పెళ్లిళ్లు చేసుకుంటే తప్పేముంది? : RRR
X

దిశ, ఏపీ బ్యూరో: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైవాహిక జీవితంపై ఏపీ మంత్రుల విమర్శలు సరికాదని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు హితవు పలికారు. పవన్ కల్యాణ్‌పై మంత్రి పేర్ని నాని అనవసరమైన వ్యాఖ్యలు చేశారని.. కుల ప్రస్తావన తీసుకువచ్చారని విమర్శించారు.

ఢిల్లీలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన కుక్కలు, గ్రామ సింహాలు, వరాహాలు అంటూ కామెంట్లు చేసుకోవడం ఇరువురికి సరికాదని సూచించారు. పవన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వైవాహిక సంస్కారాలు అంటూ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యలు చేయడం నీచాతినీచమైన సంస్కృతి అని ధ్వజమెత్తారు. పవన్ వైవాహిక జీవితం గురించి ఎత్తిచూపేటప్పుడు ఒక వేలు మినహా మిగిలిన నాలుగు వేళ్లు మనవైపే చూపిస్తాయని ఈ విషయాన్ని మంత్రి పేర్ని నాని, నటుడు పోసాని కృష్ణమురళీ లాంటి వాళ్లు తెలుసుకోవాలని హితవు పలికారు. విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవడం తప్పు ఎలా అవుతోందని ప్రశ్నించారు. పవన్ మూడు పెళ్ళిళ్లు చేసుకుంటే తప్పేముందని నిలదీశారు. ఇకనైనా ఇలాంటి నాన్సెన్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాలని మంత్రి పేర్ని నానిని కోరారు. జగన్ సర్కార్ సినిమా టికెట్లకు సంబంధించి పోర్టల్ ఏర్పాటుపై కంటే సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌పై దృష్టిపెడితే మంచిదని సూచించారు. ఇప్పటికే అనేక కేసుల్లో న్యాయవాదులకు కోట్లు చెల్లిస్తున్న ఈ ప్రభుత్వానికి ఇప్పుడీ దుబారాలు అవసరమా అంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు చురకలంటించారు.

సక్సెస్ సెలబ్రేషన్స్ లో సామ్-చై.. అన్నింటికి సమాధానం చెప్తానంటున్న అక్కినేని కోడలు

Baahubali మూవీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సజ్జల


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed