నాపై అనర్హత వేటు అసాధ్యం : ఎంపీ రఘురామ

by srinivas |
నాపై అనర్హత వేటు అసాధ్యం : ఎంపీ రఘురామ
X

దిశ, ఏపీ బ్యూరో: తనపై అనర్హత వేటు వేయడం సాధ్యం కాదని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తేల్చి చెప్పారు. పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లోక్‌సభలో వైసీపీ చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌ శుక్రవారం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన ఎంపీ రఘురామ తాను ఏ పార్టీతోనూ జట్టుకట్టలేదని.. అధికార పార్టీ కార్యకలాపాలకు విరుద్ధంగా వ్యవహరించలేదని చెప్పారు.

ప్రభుత్వ సంక్షేమ ఫలితాల అమలు లోపాలను మాత్రమే ప్రస్తావించినట్లు చెప్పుకొచ్చారు. కొంతమంది తప్పుడు వ్యక్తుల నుంచి పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నానని.. వాస్తవాలు ఎప్పటికైనా బయటకు వస్తాయని రఘురామ తెలిపారు. తనపై దాడి చేసిన వారి విషయంలో మరోసారి ప్రివిలైజ్‌ మోషన్ ఇస్తానని రఘురామ ప్రకటించారు. తనపై ఈ నెల 10న ఫిర్యాదు చేసి 11వ తేదీన ఫిర్యాదు చేసినట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారని రఘురామ మండిపడ్డారు. హోంమంత్రి సుచరిత, సీఎం జగన్‌ని కలిశాకే కొంతమంది నాయకులు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారని అందులో వాస్తవం లేదన్నారు. అనర్హత వేటుపై ఇప్పటికే తనపై నాలుగైదు సార్లు ఫిర్యాదు చేశారని రఘురామ గుర్తు చేశారు.

Advertisement

Next Story