వారికి రూ.5వేల చొప్పున సాయం చేయండి

by Anukaran |   ( Updated:2020-07-14 04:43:25.0  )
వారికి రూ.5వేల చొప్పున సాయం చేయండి
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ వైపు వైసీపీతో ఢీ అంటే ఢీ అంటున్న ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు.. మరోవైపు ప్రజాసమస్యలపై సీఎం జగన్‌కు లేఖలు రాస్తున్నారు. అయితే, తాజాగా భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో 20లక్షల 64 వేల భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లు నమోదు చేయించుకున్నారని చెప్పారు. అందులో 10లక్షల 66 వేల మంది కార్మికుల పేర్లను మాత్రమే ఆధార్‌తో లింక్ చేశారని, మిగిలిన వారి పేర్లు వెంటనే లింక్ చేసేలా చర్యలు తీసుకోవాలని నరసాపురం ఎంపీ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2019 మధ్య కాలంలో బిల్డర్స్ నుంచి సంక్షేమ నిధి రూపేణా రూ. 1,364 కోట్లు వసూలు చేసిందని గుర్తుచేశారు.

అయితే ఇప్పటి వరకూ రూ.330 కోట్లు మాత్రమే కార్మికుల కోసం ఖర్చు చేశారని రఘురామకృష్ణంరాజు వివరించారు. మిగిలిన రూ. వెయ్యి కోట్ల నిధుల నుంచి ఒక్కో భవన నిర్మాణ కార్మికుడికి రూ. 5 వేల చొప్పున ఆర్ధిక సాయం అందించాలని ఏపీ సీఎం జగన్‌కు రాసిన లేఖలో ఎంపీ రఘురామకృష్ణంరాజు కోరారు.

Advertisement

Next Story

Most Viewed