- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నా ఇంటిపై దాడులు జరగొచ్చు.. ఎంపీ రఘురామ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో : ఏపీలో నెలకొన్న పరిస్థితులపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పౌర యుద్ధం తప్పదేమోనన్న అనుమానం వస్తోందన్నారు. త్వరలోనే భీమవరంలోని తన ఇల్లు, కార్యాలయాలపై కూడా దాడులు జరిగే అవకాశం లేకపోలేదని కామెంట్స్ చేశారు. వచ్చే వారమే దాడి చేయాలని కార్యకర్తలకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లినట్టు తనకు సమాచారం అందిందని అన్నారు.
ఈ విషయాన్ని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లానని.. అలాగే డీజీపీ గౌతం సవాంగ్‌కు కూడా లేఖ రాసినట్లు వెల్లడించారు. అయితే.. మంగళగిరిలో కాబట్టి దాడులతో సరిపెట్టారని, అదే సీమలో అయితే పరిస్థితి ఖూనీల వరకు వెళ్లేదని వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్న వ్యాఖ్యలను ఈ సందర్భంగా రఘురామ ప్రస్తావించారు.
Next Story