- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సీఎం అలా మాట్లాడడం సరికాదు: రఘురామ కృష్ణం రాజు
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: క్రిస్మస్ రోజు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో సీఎం జగన్ కనీస పరిజ్ఞానం లేకుండా అమరావతిపై వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. ఆదివారం నరసాపురంలో మీడియాతో ఎంపీ మాట్లాడుతూ… అమరావతిలో ఎస్సీ వర్గానికి చెందినవారు 50 శాతం పైగానే ఉన్నట్లు తెలిపారు. సీఎం జగన్ గణాంకాలు తీసుకొని మాట్లాడితే బాగుంటుందన్నారు. అమరావతిలో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే వ్యాఖ్యలు చేయకుండా సమన్వయం పాటించాలని సూచించారు. ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా మాట్లాడడం వల్ల పార్టీకి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.
Next Story