- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బీజేపీకి ఓటు వేసి లాభం లేదు’
దిశ, దుబ్బాక: దుబ్బాక నియోజకవర్గాన్ని సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల తరహా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలంటే రాబోయే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం పలు గ్రామాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌తో కలిసి పర్యటించారు. ఈ క్రమంలోనే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం మిరుదొడ్డి మండలం మోతే గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించి, లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదిముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ…
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కలిగిన ప్రభుత్వమే ఉందన్నారు. రాబోయే ఉప ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటే, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. అంతేగాని బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే వారు చేసేది ఏమీ లేదన్నారు. రాష్ట్రంలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే లేనప్పుడు వారికి ఓట్లేసి లాభం లేదన్నారు. నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాలు పంచుకునేది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు కేవలం మాటలతో ఆర్భాటం చేసి ఎన్నికల ముందు వచ్చి ఓడిపోగానే తట్టా బుట్టా సదురుకొని పోతారని ఎద్దేవా చేశారు.