- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదానీ- హిండెన్ బర్గ్ పై జేపీసీ వేయాలి.. బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు
దిశ, తెలంగాణ బ్యూరో : అదానీ - హిండెన్ బర్గ్ అంశంపై తక్షణమే సంయుక్త పార్లమెంటరీ కమిటీని వేసి, నిజాలు నిగ్గు తేల్చాలని ఎంపీ నామా నాగేశ్వర్ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం అదానీ అంశంపై జేపీసీ వేయాలని బీఆర్ఎస్, విపక్ష సభ్యుల పట్టు పట్టుబట్టారు. బీఆర్ఎస్ ఎంపీలు స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్లారు. దీంతో ప్రతిష్టంభన ఏర్పడింది. బీఆర్ఎస్ ఎంపీల ఆందోళనతో సోమవారానికి పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. అనంతరం విపక్ష ఎంపీల మద్దతుతో పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అదానీ అంశంపై జేపీసీ వేసి, పార్లమెంట్ లో చర్చకు అనుమతించే వరకు అవిశ్రాంతంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని దుయ్యబట్టారు. ప్రజా ప్రతినిధులమంతా దేశ రాజధానిలో న్యాయం కోసం రోడ్ల మీదకు వచ్చి ఉద్యమిస్తుంటే ప్రధాని మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు బడుగుల లింగయ్యయాదవ్, ప్రభాకర్ రెడ్డి, బీబీపాటిల్, వద్ది రాజు రవిచంద్ర, సురేష్ రెడ్డి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.