రాష్ట్రపతికి ఎంపీ కోమటిరెడ్డి లేఖ

by Shyam |
రాష్ట్రపతికి ఎంపీ కోమటిరెడ్డి లేఖ
X

దిశ, నల్లగొండ: లాక్‌డౌన్‌తో అసలే ఇబ్బందుల్లో ఉన్న ప్రజలపై 20 రోజులు నుంచి వరుసగా పెట్రోల్ ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం మరింత భారం మోపిందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. పెట్రోల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్‌కు కోమటిరెడ్డి సోమవారం లేఖ రాశారు. ఉపాధి లేక వలస కార్మికులు, పేద ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని, ఇలాంటి సమయంలో ప్రజలకు ధరలు తగ్గించి ఊరటనివ్వాల్సిందిపోయి ధరలు పెంచడం దారుణమన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజల నడ్డివిరుస్తుందని మండిపడ్డారు.

అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుంటే, మనదేశంలో మాత్రం విచిత్రంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2014లో క్రూడాయిల్ ధర 108 డాలర్లు ఉన్నప్పుడు పెట్రోల్ ధర లీటర్ రూ. 71.40, డీజిల్ రూ.59.59గా ఉందని గుర్తు చేశారు. 2020లో క్రూడాయిల్ ధర 43.41 డాలర్లకు చేరి సుమారు 60 శాతం తగ్గితే పెట్రోల్ లీటరుకు రూ.20.68 ఉండాలి కానీ, రూ.82.96 ఉందని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed