- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోనియా గాంధీకి ఎంపీ కోమటిరెడ్డి వినతి
దిశ, న్యూస్‌బ్యూరో: సీఎం కేసీఆర్ చేతిలో తెలంగాణ విలవిల్లాడుతోందని, రాష్ట్రాన్ని మీరే కాపాడాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కోమటిరెడ్డి శనివారం సోనియాగాంధీతో వీడియో కాల్ మాట్లాడారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ 4కోట్ల ప్రజల చిరకాల కోరికను నిజం చేశారని, విద్యార్థుల బలిదానాలు చూడలేక రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తుచేశారు. మిగులు బడ్జెట్‌తో ఇచ్చిన రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేశారన్నారు. కేసీఆర్ నిరంకుశ పాలనతో రాష్ట్రాన్ని రూ. 3లక్షల కోట్ల అప్పుల ఊబిలో నెట్టారని, కరోనా విషయంలో నిమ్మకు నిరెత్తనట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా టెస్టులు చేయడంలేదని, పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, తెలంగాణ ఇచ్చిన తల్లిగా ఈ రాష్ట్రాన్ని మీరే కాపాడాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి… సోనియా గాంధీని కోరారు.