- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘జగదీశ్‌పై మూడు మర్డర్ కేసులు.. సీఎం చెత్త పాలనకు శుభాకాంక్షలు’
దిశ, నల్లగొండ: భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ఇసుక అక్రమ వ్యాపారంతో నెలకు రూ.5 కోట్లు సంపాదిస్తున్నాడన్నారు. శుక్రవారం భువనగిరి పట్టణంలోని అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా నాగారంలో రూ.100 కోట్ల వ్యయంతో భారీ భవంతిని నిర్మిస్తున్నాడన్నారు. మూడు మర్డర్ కేసుల్లో ముద్దాయిగా ఉంటూ.. మంత్రి పదవిలో కొనసాగడం సిగ్గుచేటని తెలిపారు. మంత్రి జగదీశ్ రెడ్డికి వ్యవసాయం గురించే తెలియదని ఎద్దేవా చేశారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై ఎందుకు నోరు మెదపడం లేదని కోమటిరెడ్డి ప్రశ్నించారు. దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పుకునే సీఎం కేసీఆర్.. నేడు సీఓటర్ సర్వేలో 16వ స్థానంలో ఉన్నారని చెప్పారు. చెత్తపాలన అందిస్తున్న కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ సిగ్గుతో చనిపోవాలని, మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని పేర్కొన్నారు. కేసీఆర్ దక్షిణ తెలంగాణను ఏడారిగా మార్చిన 203 జీఓను జగన్ తీసుకురాలేదని, ఆ జీఓ తెరపైకి వచ్చేందుకు పాత్రధారి సీఎం కేసీఆర్ అని ఆరోపించారు. దీనికి కాంగ్రెస్ పార్టీ బాధ్యులంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ సిద్ధిపేట, గజ్వేల్‌లో చెరువులు నింపగానే అంతటా నీళ్లు వచ్చినట్టు కాదని పేర్కొన్నారు. బస్వపూర్ జలాశయం ఇంకా పునాది వద్దనే ఉందని, గంధమల్లను పూర్తిగా రద్దు చేశారని, దీనికి ఏమి సమాధానం చెబుతారంటూ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ఈ ప్రాజెక్టులు వస్తున్నాయని చెప్పి ఓట్లు అడిగి ఎమ్మెల్యేలుగా గెలిచారని, నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కొండపోచమ్మ ద్వారా లిఫ్ట్ పెట్టి చెరువులు నింపుకుంటున్నారని, ఇక్కడ బస్వపూర్ నుంచి గ్రావిటీ కాల్వల ద్వారా నీరు వెళ్లేలా నిర్మిస్తామని చెబుతున్నారని, మరి జలాశయంలో నీరు ఎలా నింపుతారో చెప్పలేదని ఎద్దేవా చేశారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో సాగు నీరు కోసం పోరాటం జరుగుతుందని, ఈ ప్రాంతాన్ని ఎడారిగా మారుస్తున్నారని, ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పారు. కమీషన్ల కోసం ప్రాజెక్టులు కడుతున్నారని, భువనగిరి, ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని, కేంద్రం నుండి నిధులు తీసుకువస్తామని చెప్పారు.