- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ పేరు నా వద్ద ఎత్తొద్దు.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: “పీసీసీ చీఫ్ పదవి నా దృష్టిలో చాలా చిన్నది. అదేమంత పెద్దది కాదు. దానికి నియమితులైన రేవంత్‌రెడ్డి చిన్నస్థాయి నాయకుడు. నా దగ్గర ఆయన పేరు ఎత్తొద్దు’’ అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి గురించి నా దగ్గర మాట్లాడొద్దు అని కామెంట్ చేసిన కోమటిరెడ్డి రాజకీయాల గురించి మాట్లాడబోనని, గతంలోనూ ఇదే చెప్పానని, ఇకపైన తన దృష్టంతా నియోజకవర్గ అభివృద్ధి పైనే అని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో ఆదివారం ఢిల్లీలో భేటీ అయిన తర్వాత మీడియాతో ముచ్చటిస్తూ, తెలంగాణ కాంగ్రెస్‌ను నడిపే, పార్టీని ముందుకు తీసుకెళ్ళే సమర్ధవంతమైన నాయకుడు లేరన్నారు. పార్టీ నేతలంగా రాజకీయాలను వదిలేసి అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు.
ప్రస్తుతానికి పార్టీ మారే ఉద్దేశంగానీ, ఆలోచనగానీ లేదని, ఆ అవసరం అంతకన్నా లేదని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిసింది కూడా నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించేనని, తన నియోజకవర్గ పరిధిలో అనేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధి అవసరమని, దాని గురించి ఆయనతో చర్చించినట్లు వివరించారు. భువనగిరి కోట అభివృద్ధి, మూసీ నది ప్రక్షాళన, ఫార్మా సిటీ తదితర అంశాలను చర్చించినట్లు తెలిపారు. గజ్వేల్‌లో ఉన్న ఫార్మా కంపెనీలను సైతం హైద్రారాబాద్ చుట్టు పక్కలకు మార్చాలని చూస్తున్నారని, ఫార్మా సీటీకి 19 వేల ఎకరాలు ఒకే దగ్గర అవసరం లేదని అన్నారు.
కిషన్‌రెడ్డి చాలా సౌమ్యుడని, మొదటి నుంచీ వివాదాలకు అతీతంగా ఉన్నారని, ఇద్దరం కలిసి దీర్ఘకాలం పాటు ప్రజా ప్రతినిధులుగా కలిసి పనిచేశామన్నారు. ప్రస్తుతం కేబినెట్‌లో స్థానం దక్కించుకున్నారని, తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాలను పూర్తి చేసేందుకు సహకరించాల్సిందిగా, ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.