ఇళ్లు అమ్ముకున్నా కట్టలేరు: కోమటిరెడ్డి

by Shyam |
ఇళ్లు అమ్ముకున్నా కట్టలేరు: కోమటిరెడ్డి
X

దిశ, నల్లగొండ: గందమల్ల రిజర్వాయర్​ పూర్తి చేయకుండా​ సీఎం కేసీఆర్ ఆలేరు నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట​రెడ్డి మండిపడ్డారు. రిజర్వాయర్​ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని లేకపోతే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో మంగళవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. సీఎం కేసీఆర్​ తన ఫాంహౌజ్​కు లిఫ్టుల ద్వారా గోదావరి నీళ్లను మళ్లించుకుంటున్నారని ఆరోపించారు. బస్వాపూర్​ రిజర్వాయర్​ నుంచి గ్రావిటీ కాలువల ద్వారా ఆలేరు నియోజకవర్గానికి ఏవిధంగా నీళ్లిస్తారని ప్రశ్నించారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం గందమల్ల రిజర్వాయర్​ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్​ చేశారు. లేకపోతే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. అసమర్థుడైన వ్యక్తి విద్యుత్​ శాఖ మంత్రిగా ఉన్నారని విమర్శించారు. ప్రస్తుతం వస్తున్న కరెంట్​ బిల్లులను పేదవారు ఇళ్లు అమ్ముకున్నా కట్టలేని విధంగా బాదేశారని మండిపడ్డారు. అధికంగా వచ్చిన కరెంట్​ బిల్లులను ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ కట్టవద్దని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed