ఆ రెండు పార్టీలకు నోట మాట రావట్లేదు: జీవీఎల్

by srinivas |
ఆ రెండు పార్టీలకు నోట మాట రావట్లేదు: జీవీఎల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో వైసీపీ, టీడీపీ రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని రాజ్యసభ ఎంపీ జీవీఎల్ విమర్శించారు. వైసీపీ, టీడీపీలు ఒకే బాటలో బడ్జెట్‌ను తప్పుబడుతున్నాయని మండిపడ్డ జీవీఎల్.. బీజేపీని చూస్తే ఆ రెండు పార్టీలకు నోట మాట రావడం లేదన్నారు. వాస్తవాలు మాట్లాడకుండా రాజకీయం చేయడం తగదని, గతంలోనూ టీడీపీ అలాచేసి దెబ్బతిందని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం సైతం చావు దెబ్బ తింటుందన్నారు. ఏపీకి వచ్చే ఐదేళ్లలో రూ.2.34లక్షల కోట్ల నిధులు రాబోతున్నాయని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed