- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఈటల చేరికపై బండి సంజయ్ క్లారిటీ..

X
దిశ, వెబ్‌డెస్క్ : మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీలో చేరికపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరే అంశంపై ఢిల్లీ పెద్దలతో మాట్లాడినట్లు సంజయ్ తెలిపారు.
ఉద్యమకారులను కాపాడుకోవాలని కేంద్రానికి సూచించినట్లు బండి చెప్పుకొచ్చారు. అదే విధంగా కమల దళపతి రాష్ట్ర బీజేపీ నేతల అభిప్రాయం సేకరించగా ఈటల చేరికపై వారు పాజిటివ్‌గా ఉన్నట్లు తేలింది. కొందరు నేతలైతే ఈటలను పార్టీలో చేర్చుకోవాలని తనకు సూచించినట్లు కరీంనగర్ ఎంపీ వెల్లడించారు. కాగా, మరో రెండు రోజుల్లో ఈటల చేరికపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు బండి సంజయ్ స్పష్టం చేశారు.
Next Story