ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎంపీ

by Shyam |   ( Updated:2020-04-09 03:51:31.0  )
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎంపీ
X

దిశ, నల్లగొండ: సూర్యాపేట మండలంలోని టేకుమట్ల, ఎండ్లపల్లి, హనుమతండా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గురువారం పరిశీలించారు. గ్రామాల్లో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో క్రయవిక్రయాలను, వసతులను అడిగి తెలుసుకున్నారు. ఆయా కేంద్రాల్లోని రైతులకు, హమాలీలకు మాస్కులు పంపిణీ చేసి, వాటి వినియోగంపై అవగాహన కల్పించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించి కరోనా మహమ్మారిని తరిమివేయాలని తెలిపారు.

tags: MP badugula lingaiah yadav, inspects, grain buying center, suryapet

Advertisement

Next Story

Most Viewed