- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేమంటేనే భయం.. పాతబస్తీలో బీజేపీ ఏం చేయలేదు: అసదుద్దీన్
దిశ సిద్దిపేట: మజ్లిస్ పార్టీ ఏ ఎన్నికల్లో పోటీ చేసినా.. మిగతా పార్టీల్లో భయం మొదలవుతోందని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అణచివేస్తున్న ప్రభుత్వంలో మన గొంతుక వినిపించాలని.. అందుకే పార్టీ బలోపేతం కోసం సిద్దిపేటకు వచ్చినట్టు ఆయన స్పష్టం చేశారు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా.. ఎంఐఎం అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ.. పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓవైసీ మాట్లాడుతూ.. ముస్లింలకు తగినంత రాజకీయ బలం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. గత 40 ఏండ్ల నుంచి పేద ముస్లింలకు రాజ్యాధికారం రావాలని ఎంఐఎం పార్టీ ఆకాంక్షిస్తోందని చెప్పారు. సమాజంలో జరుగుతున్న అణిచివేతను ఎదురించాలంటే కేవలం ఎంఐఎం పార్టీతోనే సాధ్యమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ పెద్దలు వచ్చినా ఏం చేయలేకపోయారు..
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి పెద్ద పెద్ద నాయకులు ప్రచారానికి వచ్చినా.. ఎంఐఎం గెలుపును మాత్రం అడ్డుకోలేదని.. హైదరాబాద్‌లో వాళ్ళ పప్పులు ఉడకలేదని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎద్దేవా చేశారు. ఎంఐఎం ఎప్పుడు కూడా హిందూ-ముస్లింల మధ్య గొడవలు సృష్టించలేదని.. కేవలం తమ ఉనికిని చాటుకుంటున్నారని స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎక్కడి నుంచి అయితే అమిత్ షా ప్రచారం నిర్వహించారో అక్కడే భారీ మెజారిటీతో ఓవైసీ ఘన విజయం సాధించిందన్నారు. పాతబస్తీలో బీజేపీ నాయకులు ఏం చేయలేకపోయారని హేలన చేశారు. గ్రేటర్‌లోనే 7గురు ఎమ్మెల్యే సీట్లు గెల్చుకున్న తమకు సిద్దిపేటలో 5 కౌన్సిలర్ సీట్లు గెల్చుకోవడం పెద్ద సమస్య కాదని అసదుద్దీన్ ధీమా వ్యక్తం చేశారు.